#537

యేసునాథా, రమ్ము

రాగం: శహాన · తాళం: ఏక · రచయిత: ఫిలిప్ బెంజమిన్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసునాథా రారారా – మా – జీవనాథా రారారా ||యేసు||
చరణము 1
దోషములు బాప నీవు – వాసిగ జన్మించినావు ||యేసు||
చరణము 2
నీచులను ప్రేమించి – నీ కరుణను చూపినావు ||యేసు||
చరణము 3
నీతిలేనివారి కెల్ల – నిత్య జీవ మిచ్చినావు ||యేసు||
చరణము 4
పొందరాని కష్టములను – పొంది యుంటివి తండ్రి ||యేసు||
చరణము 5
లోకపాపమును జయించి – లోకుల రక్షించితివి ||యేసు||
చరణము 6
వేడుకతోడ మేము – వేడుకొందుమో తండ్రి ||యేసు||