#540
సాయంకాల ప్రార్థన
పల్లవి · Pallavi
దేవ కావవే – రాత్రి మమ్ములను – నీవు నేడు కాచినావు – నీకు స్తోత్రము ||దేవ||
చరణము 1
ఆపదలు మమ్మును – అంటకుండను – కాపుగాచి మంచి నిద్ర – కలుగ జేయుమీ ||దేవ||
చరణము 2
పండియుండగా – పాము తేళ్లును – గండములను దొలగజేసి – కాయుమో ప్రభో ||దేవ||
చరణము 3
దుస్స్వప్నములు – దొంగ భయమును – కష్టములను దొలగజేసి – కాయుమో ప్రభో ||దేవ||