#53
సాయంతన ప్రార్థన
పల్లవి · Pallavi
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదమునీ సుదయా రసము – నిత్యంబు మమ్ముగావుము || మా ||
చరణము 1
చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభోబిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రి || ఈ ||
చరణము 2
దుష్టుండు శోధకుని – ద్రొక్కుటకు బలమిమ్ముభ్రష్టత్వమున మేము – పడకుండగ కాపాడుము || మా ||
చరణము 3
నీ యేక పుత్రుండు – శ్రీ యేసు నామమునసాయంత ప్రార్థనలెల్ల – సరగ నాలించుమా || ఈ ||
చరణము 4
జనక సుత శుద్ధాత్మ – ఘనదేవా నుతియింతుముఅనిశము జీవించి – జయంబు చేయుమా ఆమెన్ || ఈ ||