#52

సాయంతన ప్రార్థన

రచయిత: ఎ. చార్లెస్ కిన్సింగర్

Category: సాయంతనారాధన · Open in the hymnal app

చరణము 1
ఆకాశంబు భూమియు – అంతట చీకటి ఆయెనుప్రాకెడు చీకటి సమయమున – ప్రార్థన చేతుము మా దేవా ||
చరణము 2
చక్కని చుక్కలు మింటను – చక్కగా మమ్మును చూడుచుండగాప్రక్కకు రావే వేగముగా – ప్రభువా కావుము కావుము నీ నీడన్ ||
చరణము 3
చిన్న చిన్న పక్షులు – చిన్న చిన్న పూవులుఎన్నో ఎన్నో జీవులు – నిన్నే కొలిచి నిద్రించున్ ||
చరణము 4
చిన్ని చిన్ని పాపలు – చిన్ని చిన్న పడకలలోచిన్ని కన్నులు మూయంగా – చెన్నుగ యేసు కావుమా ||
చరణము 5
నేలను బోయెడి బండ్లలో – నీటను బోయెడి ఓడలలోగాలి విమానంబులలోన – కావుము దేవ ప్రయాణికులను ||
చరణము 6
రాత్రిలో నీదు దూతలు – రమ్యంబైన రెక్కలతోచిత్రంబుగ మమ్మును గ్రమ్మన్ – నిద్రించెదము మా దేవా ||
చరణము 7
తెల్లవారు జామున – తెలివొంది మేము అందరముమెల్లగ లేచి నుతింపన్ – మేల్కొలుపుము నా ప్రియ తండ్రి ||
చరణము 8
జనక తనయ శుద్ధాత్మ – జయము మహిమ స్తోత్రములుఅనిశము నీకే చెల్లునుగా – అనిశము చెల్లును నీకామేన్ ||