#525
ధైర్యమునకు ప్రేరణ
పల్లవి · Pallavi
దానియేలువలె సాహసించుడి – ఒంటరిగా నిల్వ – దానియేలువలె साహసించుడి దానియేలువలె సాహసించుచు – జ్ఞానులై దృఢ కార్యము కలిగి – దీనులై యా దృఢకార్యం బిక బూని తెల్పను సాహసించుడి ||దానియేల్||
చరణము 1
నిక్కమగు కార్యమునందు నిలిచి – దైవాజ్ఞలెల్ల గ్రహింపవలెను జనముల గాంచి చక్కగా వారిని ఘనపరచుచు – సంతతము నెనరు చూపించుచు – మిక్కిలి దానియేలు సంఘమును – మెచ్చుచు నంగీకరించుడి ||దానియేల్||
చరణము 2
ధారుణిపై నగరములలో – మరణం జరిగిగా కడు – శూరులనబడువారనేకులు – వారు దానియేలు సంఘమును గని – కోరి యేకభవించిన మది – వారలే ప్రభుదేవుని భట పరి – వారమనబడియుందురు నిజ మింక ||దానియేల్||
చరణము 3
కాన నీ సువిశేషమను జెండా పైకెత్తుడి సై – తానుని నెదిరింపను రండి – దీనిని దీని శ్రేణులను యు – దానికై రారమ్మని పిలిచి – దానియేలు సంఘము పక్షమున – బూని జయధ్వనులను జేయుటకై ||దానియేల్||