#526
యేసువలె జీవించుట
పల్లవి · Pallavi
యేసువలెను – ఇల నేనుండగోరుదున్ – యేసువలెను ||యేసు||
చరణము 1
శుద్ధుడనై బ్రతుకు – బద్ధుడనంచును – శుద్ధుడనై యుండ – శ్రద్ధ చూపుదు నేను ||యేసువలెను||
చరణము 2
భరింపవలసిన – భారంబులగల్ గె నెన్నో – భరింప మిక్కిలి బలశాలినై నేను ||యేసువలెను||
చరణము 3
సాధింపవలెనెన్నొ – సాహసకార్యంబుల్ – సాధింపధైర్యాన – సాగి పోవుదు నేను ||యేసువలెను||
చరణము 4
ధాత్రి నెల్లరితోడ – మైత్రినేర్పరచుచు – శత్రువులకునుగూడ – మిత్రుడనై నేను ||యేసువలెను||
చరణము 5
ఒరుల చింతలు దీర్చు – నుల్లాసమున గూర్చు – పరమ ప్రేమతో నెప్పుడు – పైకి ఈతును నేను ||యేసువలెను||
చరణము 6
నా దివ్యజనకుడు – నాకు ననుదినమును – బోధింప వాక్యంబు బుద్ధితో నేర్తును ||యేసువలెను||
చరణము 7
వినయసంతసంబున – ప్రభుని యాజ్ఞలెల్ల – వెనువెంట జేసెద – వినయంబున నేను ||యేసువలెను||