#524
క్రైస్తవ యువజనులారా క్రీస్తు కొరకు నిలువండి
పల్లవి · Pallavi
భారత క్రైస్తవ – యువజనులారా – ప్రభుకై నిలువండి భారతరక్షక – భటవరులారా – ప్రభువును చూపుటకై లేవండి – ఫలితము గనరండి ||భారత||
చరణము 1
బాలప్రాయమున మీరలల్లా – భక్తి జీవితాసక్తిపరులై – అలయజేసులను బోలినవారై – బలతర సామర్థ్యము చూపి – ఫలితముగనరండి ||భారత||
చరణము 2
శోధనాధికము చుట్టునున్న – సకల యాశలును – నెట్టుచున్న – బాధించుచున్న మరి సాధించెడి యా – సైతానుని గెలువగ లేవండి – ఫలితము గనరండి ||భారత||
చరణము 3
నమ్మకంబు మదియందు బూని – నేర్పుతోడ ప్రభు సేవచేయ – రమ్మిదే యేసుని రక్షణ సేవకు – రజితమగు – జీవమునొందన్ – ఫలితము గనరండి ||భారత||
చరణము 4
విజయ కాంక్షగలవారలల్లా – వినయ భూషణాసక్తిపరులై – నిజమగు క్రైస్తవ నీతిని చూపి – నిరతముగా వెలుగుదురండి – నిజమిది గనుగొనుడి ||భారత||