#517
మాదిరి కుటుంబము
పల్లవి · Pallavi
యెహోవా యందు – భక్తి – బహుగ గలిగియుండి – మహిమాఢ్యుని మార్గంబులయందు – గృహముల నడుపు నరులే ధన్యులు ||
చరణము 1
దేవుని యందలి – భయము – దీనుల దీవించును నీవు నీ చేతుల కష్టార్జితమును – నిత్యము ననుభవింతువు నిజముగ ||
చరణము 2
ఉల్లమలర భార్య – ద్రాక్ష – వల్లివలె ఫలింప పిల్ల లొలీవ మొక్కల చందము – పెంపొందుదురు రెంతయు సొంపుగను ||
చరణము 3
దేవుని భక్తియే – నీకిల – దీర్ఘాయువు నిచ్చును గావున నీ పిల్లల పిల్లలను గాంతువు ప్రభు కృపతో వెలుగుదువు ||