#518

క్రైస్తవుని ప్రతిజ్ఞ

రాగం: యమునా కళ్యాణి (ఛాయ: జీవితాంతమువరకు) · తాళం: త్రిపుట · రచయిత: ఏ. చార్లెస్ కిస్సింగర్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
నేనును నా ఇంటివారును – నీతి సూర్యుని గొలుతుము దీనమనస్సును గలిగి దేవుని – దివ్యసేవను జేతుము ||
చరణము 1
అనుదినంబును – ప్రభుని దలచుచు – నలయకను బ్రార్థింతుము అనవరత మా ప్రభుని చిత్తము – ననుహరింతుము పనులలో ||
చరణము 2
వేదవాక్య పఠనమందు – విసుగు – జెందక నుందుము ఆదరంబున దైవచిత్తము – ననుసరించుచు నడుతుము ||
చరణము 3
ఆశతోడను ప్రభుని దినమును – నాచరింతుము మరువక విసుగు జెందక నా లయమునకు – పిన్ని పెద్దల దెత్తుము ||
చరణము 4
సంఘ కార్యక్రమములందు – సహకరింతుము ప్రీతితో భంగ పరచెడి పనులన్నిటి – కృంగదీసెద మనిశము ||
చరణము 5
ప్రేమతోడను పొరుగువారిని – ప్రియులుగాను భావింతుము క్షమయు స్నేహము నేర్చి ప్రభుకడ – శాంతితో జీవింతుము ||
చరణము 6
శక్తికొలది శరీరబలమును – శ్రమను క్రీస్తుకు నిత్తుము భక్తితో హృదయమును పూర్తిగా – ప్రభునికే యర్పింతుము ||
చరణము 7
చిన్నవారలు దైవరాజ్యపు – చిరుత వారసులంచును అన్నివేళల వారి వృద్ధికి – మిన్నగ దోడ్పడెదము ||
చరణము 8
పెద్దవారలు దైవజనులని – పేర్మితో భావింతుము శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును – శ్రద్ధతోడను జూపుచు ||
చరణము 9
జీవితంబున ప్రభుని ప్రేమా – శీస్సులను ప్రసరింతుము దివ్యజ్యోతుల రీతి వెలుగుచు – దివ్యసన్నిధి నుందుము ||