#516

క్రైస్తవ గృహము

రాగం: బిలహరి (ఛాయ: యేసునాథ కథా సుధారసము) · తాళం: త్రిపుట · రచయిత: పి. విజయ చార్లెస్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసుక్రీస్తుని దాసులారా – మీ సుతులకును నేర్పరే ఆశతో యెహోవా యాజ్ఞల – నభ్యసింపగ జేయరే ||యేసు||
చరణము 1
పిల్లలెప్పుడు ననుసరింతురు – తల్లిదండ్రుల నడతలను ఎల్ల విషయములందు మాదిరి – పిల్లలకు గనపరచరే ||యేసు||
చరణము 2
మోదమిచ్చు కుటుంబ ప్రార్థన – నేదినంబును మానక ఆదివారపు బడికి బిడ్డల – నాదరముతో బంపరే ||యేసు||
చరణము 3
యేసు నాథుని బోలు నాయకు – డే జగంబున లేదని యేసుకే నిజ శిష్యులగుటకు – నేర్పరే యౌవనులకు ||యేసు||
చరణము 4
యేసు సౌశీల్యమును వారికి – వాసిగా బోధింపరే పసితనముననే వారి హృదయము – యేసు రూపము దాల్చును ||యేసు||
చరణము 5
యేసుక్రీస్తులో నిలిచి వారలు – యేపుమీర ఫలింపగా యేసు వాక్యము వారి యెడల లో – నాశతోడను నాటరే ||యేసు||