#515

క్రీస్తును గృహమున ప్రతిష్ఠించుట

రాగం: శహన (ఛాయ: విజయగీతములు పాడరే) · తాళం: త్రిపుట · రచయిత: పి. విజయ చార్లెస్

Category: క్రైస్తవ కుటుంబము · Open in the hymnal app

పల్లవి · Pallavi
ప్రభువుగను ప్రతిష్ఠింపరే – గృహమున క్రీస్తును – ప్రభువుగా ప్రతిష్ఠింపరే విభవమొందగ నతని – శుభమౌ నామము ధర సౌ – రభమును వెదజల్లగ – ప్రబలమౌ ప్రేమను – ప్రభుని యెడ గనపరచరే ||ప్రభువుగను||
చరణము 1
పూర్ణ ప్రేమను జూపరే – గృహమున క్రీస్తుకు – పూర్ణ ప్రేమను జూపరే పూర్ణ హృదయముతోను – పూర్ణయాత్మతో – మరి ప్ర – పూర్ణ శక్తితో జూపరే – క్రీస్తునిలో సం – పూర్ణులగుటకు సాగరే ||ప్రభువుగను||
చరణము 2
భక్తితోడను గొల్వరే – గృహమున క్రీస్తును – భక్తితోడను గొల్వరే ముక్తినాధుడు తన స్వ – రక్తమియ్యెను మనకై – రిక్తుడాయెను జూడరే – ముక్తిదాతను నా – శక్తితో గొనియాడరే ||ప్రభువుగను||
చరణము 3
నమ్మకస్థులై యుండరే – గృహమున క్రీస్తుకు – నమ్మకస్థులై యుండరే అమ్మహాత్ముని నామ – మిమ్మహిన్ దగ జాటన్ – నమ్మె మిమ్మును జూడరే – సమ్మతిన క్రీస్తును – నమ్మకంబుగ జాటరే ||ప్రభువుగను||