#514
కుటుంబారాధన
పల్లవి · Pallavi
దేవరా బ్రోవుమా – దీన కుటుంబమును దీవెనలొసగుచు – ధాత్రిని నడుపుమా ||దేవరా||
చరణము 1
పావనమగు స్వ – భావము నిమ్మా – పాలింపరా మా – పాలిటి దైవమా ||దేవరా||
చరణము 2
యేసు ప్రభువా మా – ఇంటికి శిరసై – వాసము చేయుమా – మా యందున నిలువుమా ||దేవరా||
చరణము 3
అనుదిన భోజనము – లనుగ్రహించి మా పనిపాటలలో – ప్రక్కన నిలువుమా ||దేవరా||
చరణము 4
పిల్ల పెద్దలను – బెంచుము ప్రేమతో – నెల్ల సమయముల – యందున గావుమా ||దేవరా||
చరణము 5
అణకువ త్యాగము – ననునది సత్యార్యముల్ – గణుతించుచు నిన్ను – గొలుతుము దేవ ||దేవరా||
చరణము 6
నీ పరిశుద్ధత – నేర్పుము యేసువా – కాపరివై – కాయుము మమ్ము ||దేవరా||
చరణము 7
క్రైస్తవ జీవము – క్రమముగ నొందుచు – ప్రస్తుతింతుము మా – ప్రభువా బ్రోవుమా ||దేవరా||