#513
When all my labours
చరణము 1
శృంగార దేశము చేరగానే నా దుఃఖ బాధలన్నియున్ బోవున్ యేసుని యొద్దను నిత్యమునే నుండుట మిక్కిలి యాశ్చర్యము ||ఇదే నాకు ఆనందము ఆనందము, ఆనందము నేను ఆయనను చూచుటయే ఇదే నాకున్ పరమానందము||అమితమైన కృప వలన నన్ను స్వర్గంబునన్ జేర్చుదురు అచ్చోటనుండి యేసుని గాంచి స్తుతి కీర్తనలు పాడుదును.
చరణము 2
నేను ప్రేమించు స్నేహితులను అక్కడ జూసి సంతోషింతును నా యేసు ముఖము చూచుటయే నిత్యము నాకది యానందము.ఆ స్వర్గ సౌఖ్య మొందు వరకు కండ్లతోడన్ జూడక పోయినను యేసుని మాటలు గైకొనుచు నాత్మతోడన్ జూసి సంతోషింతును.