#504
పరిశుద్ధుల ప్రకాశత
పల్లవి · Pallavi
పరిశుద్ధి పరిశుద్ధి – పరిశుద్ధి యని వినబడు పురమదిగో – పద పదరే ప్రియులారా పరమేశ్వరుని చేతన్ – బరిపాలనము గలిగి – చిరమై భాసురమై – సుస్థిరమై సుందరమైన ||పరిశుద్ధి||
చరణము 1
$^1$రవితోను $^2$కుముదబాంధవుతోను మరి దీప – $^3$కచ్చిత్రితోను దాని కవ – సరం బింతలేదు $^4$అవిరతమునన్ క్రీస్తు – డందుండు $^5$ప్రభతో $^6$సంస్తవమై $^7$వైభవమై యు – త్సవమై వెల్గుచు నుండున్ ||పరిశుద్ధి||
చరణము 2
కొరతయైన మరియేయు – పదయైన దగయైన – మొదలే లేకుండు నప్పుర వాసులందు – మృదు జీవోదకము ల – రిమిలి నిరంతర మిచ్చు – గుదురుగ నెదురుగన్ – గూర్చుండి యువరాజు ||పరిశుద్ధి||
చరణము 3
ప్రభు కృపాసనములో పలినుండి ప్రవహించి – శుభమైన నది యుండి సుఖమిచ్చు నచట – నుభయ తీరములందు – నుండు వృక్షములు సౌ – రభదీప్తి శుభములై – రక్షా ఫలము లిచ్చు ||పరిశుద్ధి||
చరణము 4
జననంబు మరణంబు – సంసార సుఖ బాధ – లనుభవించుట గల్ల – దా పురమునందు – మును నీతి కొరకు కాపాడుటను బొందు తనవారి – కనునీళ్లన్నియు తుడుచు – మన దేవుడందుండి ||పరిశుద్ధి||
చరణము 5
వెల్కంద రాని నిశ్చలమైన ఘన జీవ – $^8$విలసిత కిరీటము – లల్ల నప్పురమునన్ – బిలిచినప్పుడే విభుని – పెండ్లి విందున కేగు – కుల బంధువులకు ని – చ్చల నిచ్చు దేవుడు ||పరిశుద్ధి||