#503

పరలోక భాగ్యము

రాగం: జంఝూటి · తాళం: ఏక · రచయిత: గొల్లపల్లి నతానియేలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరమునందు బరమునందున – పాపమేమి లేదుగా నరయ దానిని గోరువారి – కాశ యిందు లేదుగా ||పరమునందు||
చరణము 1
$^9$వృద్ధ సర్పమనేడు వాని – సుద్దు లందు లేవుగా – సదులు లేని చోట నెపుడు – స్వామి సేవ గలుగుగా ||పరమునందు||
చరణము 2
ఎల్ల రోగ శ్రమలు మనకు – నీ స్థలంబులోనేగా – కలగబోదు క్రీస్తు మనకున్ – కంటి నీళ్లు తుడుచునగా ||పరమునందు||
చరణము 3
అంధకారమైన కార్యము – లా స్థలమున లేవుగా – సందె వెలుగు వెలుగునట్లు – స్వామి సన్నిధి యుండునగా ||పరమునందు||
చరణము 4
దొంగవాని వలన మనకు – దోపులేమి లేవుగా – యంగలార్పున డించి క్రీస్తున్ – ఆశ్రయముగ నిల్చునగా ||పరమునందు||
చరణము 5
అన్నపానములందు మనకు – నాశనమేమి లేదుగా – కన్న తండ్రి కన్న మిగిల – ఘనుని ప్రేమ గలుగుగా ||పరమునందు||