#496
పునరుత్థాన దినము
పల్లవి · Pallavi
లేచు దినము వచ్చును – మృతులెల్ల నికను – లేచు దినము వచ్చును – వేచియిలనున్నట్టి – విమలులెల్ల నడుపు – లేచి ప్రభునినెదురు – కొందు రానందముతో ॥ లేచు ॥
చరణము 1
యేసు మేఘారూఢుడై – యిలకు దిగ – వాసిగ దూత లప్పుడు –భాసురంబుగా బాక – పై నినాదము చేయ – గా సమాధుల నిద్రగాంచు జనులెల్లరు ॥ లేచు ॥
చరణము 2
కడబూర ధ్వని చేయంగ – మడిసినవారు – తడవు చేయక లేతురు – ఎడతెగకప్రభు నొద్దన్ – గడు సంతోసంబుతో – విడువక యుందురురా – విమల లోకమునందు ॥ లేచు ॥
చరణము 3
ఘన మహిమతో ప్రభువు రాగన్ – గడలి యప్పుడు – తన యందుండెడిశవములను – ఘనముగాను గాననము – ధన యందుండెడు మృతులను వినయంబుతో దెచ్చి – విభుని కప్పగింప ॥ లేచు ॥
చరణము 4
అరయంగ నీతిపరులా – నందమున నక్షర దేహులై వెలయుచు – స్థిరతరానందము –పరలోకమున నెప్పుడు – సుపరిత జీవనము లగుచు – పరమసుఖ మొందుదురు ॥ లేచు ॥
చరణము 5
కరుణలేని సమాధి – నిరతము నన్ను – జేరపట్టియుంచగలదా – వరదుడుండు క్రీస్తుండు – వరదాత సేనలతో – భరింపజేసి నిన్ను –డై యదిగో – నరుదెంచుచున్నాడు ॥ లేచు ॥
చరణము 6
మరణమా నీ ముల్లెది – నరులను నింక – వెరపించుచుండగలదా –మరణ సంహారుండు – మహిమతో నరుదెంచెన్ –మరణం బడుగబడును – మర్త్యత్వంబు నిక నుండును ॥ లేచు ॥
చరణము 7
మరణంబు నొందలేదా – ప్రభు యేసు నీ – చెరయందుండలేదా –పరమేశు తనయుండు – మరణ సమాధులను –పరిపూర్ణముగా గెల్చి – చెరను జెరగపట్టెను ॥ లేచు ॥
చరణము 8
మంగళములు పాడరే – క్రీస్తుకు జయ – మంగళములు పాడరే – మంగళములు పాడి – మంగళప్రదుడైన – శృంగార రాజునకు – సంగీతంబులతోడ మంగళములు పాడరే ॥ లేచు ॥