#494
భూస్థాపనము
పల్లవి · Pallavi
నిద్రపోయినట్టి – నీ పాద సేవకుని – సదయుడగు తండ్రి – చక్కగాదాచు – సద్విమలం బగు లోకమున నీ – సదనమందున జేర్చి శుద్ధుల – వదల కెప్పుడువారిటో నీ – పద యుగంబుల సేవ కోరుచు ॥ నిద్రపోయిన ॥
చరణము 1
ఇతడు లోకమందు – నీ వొసంగిన పని – హితమతి నొనరింఛె – యేసుని కృపను – సతతమును బాపముతోడను – జాల యుద్ధమొనరిచ్చి బ్రతికెను –నతి ముదంబున నీకు నిరతము – నుతులు నెరపెడి నాశన బూనుచు ॥ నిద్రపోయిన ॥
చరణము 2
సన్నిధిని జేరిన – సకల వర భక్తుల – కన్నీరు తుడుతువు – కరుణ మీరంగ – నిన్నునమ్మినవారి నడువడి – నీవు దేటగా నెరింగి వారికి – జెన్నుగనుదీర్చెదవు న్యాయము – సన్నుతింపగ సజ్జనావన ॥ నిద్రపోయిన ॥
చరణము 3
మరణ కాలంబున – ధరణిలో గ్రీస్తుని సిలువ – స్థిరముగా నిలిచిన –నరులందరూ – వరదుడగు రక్షకుని దయచే – స్థిర పురము నిక్కముగా జేరుచు –గరువము నేరుతురు ప్రేమ నచ్చట – ధర తరంబులు గడుచుచుండగా ॥ నిద్రపోయిన ॥
చరణము 4
పరిశుద్ధుడగు దేవ – పాద సన్నిధిలోన – పరిపూర్ణానందము – పాదుకొని యుండు – నరక బలములు చెరుప నేరవు – పరమ జనకుని సుతులునెమ్మది – స్థిర దయాళుడు కాచువారల – నిరతమును ధన యాత్మ బలమున ॥ నిద్రపోయిన ॥
చరణము 5
యేసునాథుని నమ్మి – యిలను విడిచినవారు – భాసిల్ల లేతురు – ప్రభు శక్తి నిలను – భాసురంబగు దేహములు తన – దాసులందరికీ ఇచ్చి మోక్ష ని – వాసులుగా జేసి వారల – యాశ తీర్చును మాటదప్పక ॥ నిద్రపోయిన ॥