#493
క్రైస్తవుని మరణము
పల్లవి · Pallavi
జీవము పోవగనే – దేవుని సన్నిధి – జీవుడు జేరును ॥ జీవము ॥
చరణము 1
పుష్పము రాలగనే – బాష్పము లేకనే – బుష్పము వాడిన – బుష్కలఫలమగును ॥ జీవము ॥
చరణము 2
నిధనమొందగా – నిద్దుర పోవుటే – రోదనముండదు – బాధ ముగించెను ॥ జీవము ॥
చరణము 3
నష్టము భావమై కష్టము దీరును – ఇష్టముతో ప్రభు – ఇంటను జేర్చును ॥ జీవము ॥
చరణము 4
పరమున జొరగనే – హర్షము నొందగనే – మరణము గెల్చిన – సర్వదా జీవించును ॥ జీవము ॥
చరణము 5
యేసుడు లేచెను – దాసుడు లేచును – భాసురగృహమున – వాసము చేయును ॥ జీవము ॥