#492
పరలోక నిరీక్షణ
పల్లవి · Pallavi
వేచియుంటిమి నీ తట్టు – యేసు మేము – వేచియుంటిమి నీ తట్టు – భాసురంబుగ మహిమను – భాసిల్లు రాకకై– నాశతో కరములు – చాచుచు నీవైపు ॥ వేచి ॥
చరణము 1
కూడుచుంటిమి యిచ్చట – వేడెదము గల – కూటములలో – కూర్మితో –గోడు లేని పరమ – కూటములలో భక్తి – కోటులతో గూడి – పాడుచు నిన్ను – స్తుతియింప ॥ వేచి ॥
చరణము 2
నమ్మియుంటిమి నీ యొక్క – నమ్మకమైన – నయంపు వాగ్దానములను –ఇమ్ముగా వినకేగి – నెమ్మది నెలవులు గట్టి – మమ్ములను దోడ్కొని పోవను – నమ్మబలికిన మీకై ॥ వేచి ॥
చరణము 3
వెరచుచుంటిమి యిచ్చట – తరుచుగ గలిగె – కరుకైన స్థితిగతులలోన –కరువు వేదన విధి – మరణ దుఃఖము లేని – పరమ పురమున జేరి – మురియుటెప్పుడో యనుచు ॥ వేచి ॥
చరణము 4
నిత్యంబు విలసిల్లెడి – నిశ్చలమైన – శృంగార స్వర్గంబున – ముత్యాల ద్వారమున – విచ్చితా పోవుచు –బంగారు వీధులలో – సంచరించుట యెప్పుడు ॥ వేచి ॥