#491

పరమ భాగ్యము కొరకు ఎదురుచూచుట

రాగం: శ్రీరాగము · తాళం: అట · రచయిత: ప్రబలు పదవి జేరుటెన్నటికో ॥ యేసును ॥

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
యేసును చూచుట యెన్నటికో పర – వాసుడ నగుట యెన్నటికో –భాసురముగా నా – పరమ జనకు సిం – హాసనమునదూ – తాదుల మధ్యను ॥ యేసును ॥
చరణము 1
బలితంబగు పైశాచిక బంధన – పాశము వదలుట యెన్నటికో – సలిలముగా నా – సద్గురు పాద – స్థలమున కరుగుట యెన్నటికో ॥ యేసును ॥
చరణము 2
ధాత్రి కష్ట దుఃఖాంబుధి మన మింక – దాటిగా దాటుట యెన్నటికో –మైత్రితోడి పరమాత్ముని చెంతను – మనసు తీర – మనుటెన్నటికో ॥ యేసును ॥
చరణము 3
కాంచన మకుటము కనకపు వీణెయు – ఘనముగా దాల్చుట యెన్నటికో– అంచితముగా హల్లెలూయా పాటల – నానందించుటయెన్నటికో ॥ యేసును ॥
చరణము 4
శోధన బాధల హీన ధరన్ బొందక – శోకము గెల్చుట యెన్నటికో – సాధూత్తమజన – సాంగత్యమ్మున – సంతోసమొందుట యెన్నటికో ॥ యేసును ॥
చరణము 5
నీతి రహిత పైశాచిక భటగణ – నిందలు బాయుట యెన్నటికో – ఖ్యాతిగశ్రీ పర – మాత్ముని కొలువున – గట్టిగా గుదురుట యెన్నటికో ॥ యేసును ॥
చరణము 6
రేయు వ్యాధి సంశోక మరణములు – జొరని చోటుండుట యెన్నటికో – పరిశుద్ధతయును – బరమానందము