#490
క్రీస్తునందు ఆనందించుట
పల్లవి · Pallavi
మా యేసు క్రీస్తుని – మరుగ Off గలిగెనురా – నా యాత్మ ఘనరక్షా –నగమున కెక్కెనురా ॥ మా యేసు ॥
చరణము 1
ముందు నాలో పాప – ములు చూడబడెరా డెందము తా నన్ని – టిని నొప్పుకొనెరా – యందుకై బలు దుఃఖ మాత్మ జెందెనురా – సందేహములు వీడు – జాడ గన్గొనెరా ॥ మా యేసు ॥
చరణము 2
సువిశేష బోధనా – చెవు లాలించెనురా –అవివేక శాస్త్రోక్తు – లంటు వీడెనురా – నవవస్త్ర క్రైస్తవ గోష్ఠి– భువి నా కబ్బెనురా – వివిధము లగు వేల్పు – ల విష్ట మెరి గెగదా ॥ మా యేసు ॥
చరణము 3
బాధ గురువుల మోము – ల బహు లజ్జపడెరా – గాధ మంత్రములన్ని – కడగండ్లై చెడెరా –శోధించి నా యాత్మ – శుద్ధి గోరెనురా – సాధించిప్రభు క్రీస్తు – శరణు జొచ్చెనురా ॥ మా యేసు ॥
చరణము 4
మతిలోని లోతుమ – ర్మము గానబడెరా – మితిలేని ఘన పాప – మే నిండి కొనెరా –హితముగా తన జీవ – మిచ్చె క్రీస్తుండురా – మృతిచేత మన పాప – వితతి గొట్టెనురా ॥ మా యేసు ॥
చరణము 5
కులగోత్రముల బుద్ధి – కుటిలంబు దెగెరా – బలవత్పిశాచ శృంఖలము విరిగెనురా –సిలువ మోసిన వాని – చిర సౌఖ్యోన్నతిరా – నెలవుగా నాలోన – నిలచియున్నదిరా ॥ మా యేసు ॥
చరణము 6
తన పోల్కె నొరులగ – నొంగ బ్రేమయైననురా – మనసు దేవునికి న –ర్పణ సేయబడెరా – ఘన కృపా శాంతులు – గొనెను నెమ్మదిరా – మనసుమార్పాడి మోక్ష – మహిమ గనుగొనెరా ॥ మా యేసు ॥