#489
మనశ్శాంతియే మహా భాగ్యము
పల్లవి · Pallavi
మనసానందము బొందుట కన్నను – మరియే భాగ్యము గలదన్న – అనుమానము లంక – సఖిల సుఖంబులు – దిన మొకగడికొక – తీరై యుండును ॥ మన ॥
చరణము 1
దిటముగా ప్రార్థనయను ఖడ్గమును గని – తిరుగు పిశాచము వెరచిన – పటదీపులతు గల – ప్రభు శాస్త్రోక్తులు – బహు సంశయము సం – కము నింకించును ॥ మన ॥
చరణము 2
సాధు జనోత్తమ క్రైస్తవ సంగతి – సమకూడిన మేలౌ నన్న – శోధనలన్నిటి– స్థిరముగా నోర్చెడి – శుభమతి కన్నను – సుఖమేమున్నది ॥ మన ॥
చరణము 3
తనువున దానను వానికి దురితము – తగిలెడు విధి గనవలె నన్న –యొనర క్రీస్తుని – వధాస్తంభమును – గని విశ్వాసమును – గట్టిగా బెంచిన ॥ మన ॥
చరణము 4
క్షమయును స్నేహము ప్రభుకడ నేర్చిన – శత్రువు లంక భువి లేరన్న – సమదృష్టి జగ –జ్జనుల గనుంగొన – సత్క్రైస్తవులకు – సాధన మనదగు ॥ మన ॥
చరణము 5
పరమ దయానిధి క్రీస్తుని బలమున – బాప భరంబులు విడువన్న –పరిశుద్ధాత్మని – బంధుత్వమున – అరమర చీకటు – లన్నియు దొల –గును ॥ మన ॥