#488
క్రీస్తునందు ఆనందించుట
పల్లవి · Pallavi
ఘనమైన క్రీస్తు కృపను – గనుగొంటి నిప్పుడు – ఘనుడు తనమహిమచే – గాంచి పెంచెను నన్ను ॥ ఘనమైన ॥
చరణము 1
ఆపదలలో మునిగి – యేడ్చుచుండగ నన్ను – జేపట్టెను చింత – చేజెడకు మనుచు – వేపాకు కన్న నిది – వెగటైన నా జిహ్వ –తీపుగా నొనరించి – స్థిరపరచె నిప్పుడు ॥ ఘనమైన ॥
చరణము 2
ఘనమైన యాపదల – కడలిలో బడియున్న – ఘనుడు నా దెస జూసి– మనసు నొచ్చుకొనియె – కనికరముచే నిన్ను గరుణింతు నిప్పుడే –వెనుక జూడక తనదు – వెంట రమ్మనెను ॥ ఘనమైన ॥
చరణము 3
కుల గోత్రములు వీడి – కుటిలంబు దిగనాడి – వలబడ్డ చేపవలె – వదలక పిలిచెన్ – సిలువపై నసువువిచ్చి – బలహీన మెడలించి – వలవలనుకన్నీరు – వలబోసినాడు ॥ ఘనమైన ॥
చరణము 4
పర్వతములపై గట్టు – పట్టణమువలె నిన్ను – నిలలోన నుంచితి – నుచితంబుగాను –సర్వజనులకు వెలుగు సాక్షిగా నీవుండు – గర్వింప వదనుచు ॥ ఘనమైన ॥
చరణము 5
సద్గుణ లంబగు జ్ఞాన – సరణి యిదె నా మాట – ముదముతో నమ్మినను – మోక్ష మోసగెదను – ఇక సి సాతాను బలు– కాడిక్రిందను బడిన – విదలించి నరకమున – వేతునని పలికెన్ ॥ ఘనమైన ॥