#49
సాయంతన సమర్పణము
పల్లవి · Pallavi
వినవే నా వినతి నివేదన దయ వెలయగా నో ప్రభువానిను శరణొందితి నన్ను గుశలంబున నునుపవె యో ప్రభువా ॥వినవే॥
చరణము 1
నిర్మల గతి సంధ్యా కాలంబున నీ స్తవమగు ప్రభువాధర్మదీప్తి నా కొసగి చేయు దీపవంతునిగ నన్ను ॥వినవే॥
చరణము 2
నీ మహదాశ్రయ మొసగి దుర్గతిని బడకుండగనునా మది తదభివృద్ది సమస్తముతో నన్ను గావగ ప్రభువా ॥వినవే॥
చరణము 3
ఎన్ని దినంబులు జగతి నున్న నీ కన్న వేరే గలవారాపన్నుగ మది నీ పద సంగతమై యున్నది రేపగలు ॥వినవే॥
చరణము 4
పాపకరుండను నేను సుకృతా పాది కర్మ మెరుగనీ పాద సరోజము నా కొసగుము నా పై నీ కృప జల్లగా ॥వినవే॥
చరణము 5
నీ కొరకై నా మనము దృఢంబుగాక యేసు ప్రభువానాకు పిశాచముచే భ్రమ జన్మము గాకుండగ నేలు ॥వినవే॥