#48

ఉదయస్తుతి

రాగం: ఆనందభైరవి (ఛాయ: ఎందుకు మరచితివి) · తాళం: త్రిపుట · రచయిత: బన్యన్ జోసెఫ్

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈ వేకువనేస్తోత్రము జేతుము మా దేవా రాత్రియందున మమ్మురక్షించి గాపాడి ధాత్రి మరియొక్క దినమునుదయతో నిచ్చిన దేవా ॥స్తోత్రము॥
చరణము 1
పాపశోధనలనుండి ప్రభువా మమ్ము కాపాడి బ్రోవుమయ్యఏ పాపము మమ్మును ఏల నియమింపకుండమాపు రేపులు మమ్ము మన్నించి బ్రోవుమయ్య ॥స్తోత్రము॥
చరణము 2
కన్న తండ్రికంటెను కనికరమున కాపాడెడి మా దేవాఅన్నదమ్ములవలె మేము అందరిని ప్రేమించిమన్ననతో నీ దినము మన నియ్యుము ఓ దేవా ॥స్తోత్రము॥
చరణము 3
పితా సుతా శుద్ధాత్మలనెడి దేవా ప్రీతితో గావుమయ్యానీతిమార్గములందు నిరతము మము గాచిఖ్యాతిగా నీకొరకు బ్రతుకనిమ్ము ఓ దేవా ॥స్తోత్రము॥