#47
ప్రాతఃస్తవము
పల్లవి · Pallavi
లేచి స్తుతింప బూనుకొండి లోకేశ్వరునిలేచి స్తుతింప బూనుకొండి లేచి స్తుతించెదముచూచుచు మనలను బ్రోచి ప్రేమతోకరము జాచి కాపాడు విభుని ॥లేచి॥
చరణము 1
రాత్రి జాముల యందున రంజిల్ల దన నేత్రముతెరచినందున మైత్రితో దేవ దయకు పాత్రులమైతిమిశ్రోత్రముల కింపు సత్ప్రవిత్ర గీతము పాడుచు ॥లేచి॥
చరణము 2
నిదురబోయిన వేళను నిర్మలమైన హృదయముమనకు నియ్యను ముదముతో నిదుర బొందియుదయాన లేచితిమి సదయుడైన క్రీస్తుపదముల దరిజేర ॥లేచి॥
చరణము 3
నేటి పాఠములయందున నిర్భయముగా దావివలెనిలిచి యుందు సూటిగ నీదు రెక్కల చాటుగానునిలుపు మనుచు నీటుగా దెల్లవార నిత్యముప్రేమనేల ॥లేచి॥