#46
ఉదయా రాధన
పల్లవి · Pallavi
ప్రభువా నిన్నారాధింపను జేరితిమిఉదయ శుభకాంతి ప్రభవింపగా దేవానేడు శుభకాంతి విరజిమ్మగా విభవముగానుప్రభాకరముగాను విరియు నీ తేజంబెలరంగానభివందనంబులగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ॥ప్రభువా॥
చరణము 1
ఇరులు గమ్మినదలనుండి యరుణోదయము గనుకనరిగాపు నీవే కాదా దేవా రాత్రి యరిగాపు నీవేకాదావిరివిగా మా హృదయ సీమల నెరసియున్న చీకటులుబోదరిమి శాంతంబైన మనసుల దయను ప్రసాదింపనుభజింతుము ॥ప్రభువా॥
చరణము 2
అనఘ నీ సాన్నిధ్యమున నుండగా మా దురసనలనరి కట్టుమా దేవా మా దురసనల శుచి చేయుమువినయ భయ భక్తులు దలర్పగా వినుచు నీ వాక్యోపదేశములనిశమును ధ్యానింప నాత్మను బంచి తుదకు బ్రసన్నమగుము ॥ప్రభువా॥
చరణము 3
పనిపాటలలో మేము దినము నీకే మహిమనొనగూర్ప నడిపించుమా దేవా నిన్నే ఘన పరచనడిపించుముతనువు శ్రమచే బడలినను మా దారి దుర్గమమైనకనంబడ వనట జెందక నేది జేసిన బ్రభువు గొరకని