#45

ప్రాతఃకాల ప్రస్తుతి

రాగం: నాదనామక్రియ · తాళం: ఆది · రచయిత: విలియం డాసన్

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
వేడెద నాదగు వినతిని గైకొనవే జగదీశ ప్రభో నేడు ప్రతిక్షణమెడబాయక నా తోడుండవె ప్రభో ॥వేడెద॥
చరణము 1
ప్రాతఃస్తవము భవత్సంనిధి సర్వంబుననగు నాదౌ చేతస్సున ధర్మాత్మను సంస్థితినే బాతకి నజ్ఞానుడను ప్రభువా నీవుకరుణజేయు పాపాచరణము నందుజితము బాపుము నాకు నెపుడు ॥వేడెద॥
చరణము 2
పాపముగని భీతుడనై శంకా పరతసతతము నుండన్ నా పై నుంచumu నీదగుసత్కరుణా దృష్టిని బ్రేమన్ ॥వేడెద॥
చరణము 3
నాదగు పాప భరం బంతయు నీ మీదనేయిడుచుందున్ నీదు మహాకృప నుండి యొసంగుమునిర్మల గతి నాకున్ ॥వేడెద॥
చరణము 4
అవిరత మతి నిటు లతులిత గతి నీ స్తుతినుతులు ఒనరింతున్ భవదంఘ్రులపై నాదగుభక్తిని బ్రలింపవే యేసు ॥వేడెద॥