#44

ఉదయా రాధన

రాగం: బిలహరి · తాళం: అట · రచయిత: విలియం డాసన్

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
సకల జగజ్జాల కర్తా భక్త సంఘ హృదయ తాపహర్తా యకలంక గుణమణి నికర పేటికాప్రకట లోకచయ పరమ దయాలయ ॥సకల॥
చరణము 1
నాదు నెమ్మది తొలగించుచు ప్రతివాదలీమెరయి నెంతో పాదుకొన్నారు బాధలందైననుసాధులను బ్రోవ నాదియైనట్టి నీ వాధారమై యుండు ॥సకల॥
చరణము 2
దినకృత్యముల కష్టమంత చీకటిననే నీకడ భక్తి మనవిచేయ వినుచు నా కష్టమువెస నష్టముగ జేయ ఘనముగా నాయందుగరుణ జేసితివి ॥సకల॥
చరణము 3
తమ కాపు నన్ను కాపాడుగా నేనుత్వము నిద్ర బొందితిని దనివి దీర కొమరొప్పమేల్కొనగా గూలిన మృత్యు భయము బొందనా డెందమందు నెల్లప్పుడు ॥సకల॥
చరణము 4
రాత్రి సుఖనిద్ర జెంద జేసి రక్షింప నన్నునీకే చెల్లు ప్రాతఃస్తుతులు చేయ పగలుఎచ్చు తెలివి ఖ్యాతముగా నాకు గలుగజేసితివి ॥సకల॥