#43

ప్రాతఃకాల స్తుతి

రాగం: యమునాకల్యాణి · తాళం: రూపకము · రచయిత: బేతాళ జాన్

Category: దైవారాధన — దైవస్తుతి · Open in the hymnal app

పల్లవి · Pallavi
శ్రీ యేసు కర్తను సేవ జేయుటకుమేల్కొను శ్రీ యేసు కర్తను శ్రేయములనెరిగి నీకు రేయి పవ లొసంగి యెడబాయనియంతరంగియై పాయంబు ద్రోయ సహాయంబు చేయు ॥శ్రీ యేసు॥
చరణము 1
నిదురయందు నేడు క్షేమముగా గాచినాడోసూర్యుడుదయమాయె జూడు నీ హృదయమునసదమల పదములు దరుంప ॥శ్రీ యేసు॥
చరణము 2
అంధకార మణిగెన్ హృదయాంధకారమణిగెన్ ప్రభునందు దెలివి గలుగవలెననిబంధనలు డెందమున కందముగ గూర్చి ॥శ్రీ యేసు॥
చరణము 3
కంటిపాప వలెను నిన్ను గాయువాని దయనుగను గొంటివి స్తోత్రమును జేయు మింటికినిమింటికన్నింటికిని కర్తయని ॥శ్రీ యేసు॥
చరణము 4
కలకల ధ్వని జేయు పక్షిగణములు లయనుగూయు స్వరములు ప్రభు స్తుతి జేయునీ వలయక సొలయక వెలయగ బాడ ॥శ్రీ యేసు॥
చరణము 5
సేవయందు నీకు మంచి రీవులిడు పరాకుగల భావమున బడి పోకు నేడు కామవేకామవే కామవే యంచు ॥శ్రీ యేసు॥
చరణము 6
పగటివారమంచు నిష్టములగు ప్రియలుద్రుంచు యుగ యుగములు జీవించు పురికేగెద నీ దిగులు విడువు తగు నమ్మకమున ॥శ్రీ యేసు॥
చరణము 7
మింటినంట బాడు నీ యొంటి బలిమి నేడుప్రభునంటియుండువాడు నీ కొంటి నెన్నంటికన్నింటికి నీ వాడడు ॥శ్రీ యేసు॥