#42
ప్రాతఃస్తవము
పల్లవి · Pallavi
తెల్లవారిన వేళ దెలివొంది మన క్రీస్తుదివ్య నామము బాడరే ఓ ప్రియులారాదివస రక్షణ వేడరే తల్లి రొమ్మున దాచుపిల్ల రీతిని మనలన్ జలదనంబుగా రాత్రిరెల్ల గాచిన విభుని ॥తెల్లవారిన॥
చరణము 1
నిద్రపోయిన వేళ నిఖిలాపదలు బాపినిశలన్ని గడుపు విభునికన్ భద్రముగావినుతించి భయభక్తులతో మనము ముద్రితాక్షులగేలు మోడ్చి మ్రొక్కుచును ॥తెల్లవారిన॥
చరణము 2
భానుడుదయమ బయ్యె బద్మములు వికసిల్లెగానములు జేసె బక్షులు మానసాబ్జములలర మనము కలసిరి మెట్ట పై నెక్కు నిన్నుడనెడిప్రభుని జూచి వేడకన్ ॥తెల్లవారిన॥
చరణము 3
బిటవముగ మానసేంద్రియ కాయ శోధనలుపట్టుకొనియుండు దినమునన్ దట్టముగామన నాలుక తట్ట యేసుని కరుణ జుట్టుకొనిరక్షించు శుభమడుగుకొనుచును ॥తెల్లవారిన॥
చరణము 4
పాప భారము మనము ప్రభుని పై నిడిగురుని పాదములు చెంత నొరిగి కాపుకర్త విశాల కరము మాటున దాగి యాపదలుదొలగించు మని వేడుకొనుచును ॥తెల్లవారిన॥