#41
ఉదయా రాధన — ప్రాతఃకాల కీర్తన
పల్లవి · Pallavi
మేలుకొనరే మీ మనంబుల మేల్మిగామీ మేర దప్పక పాలు మాలక లేచి దేవునిపాదములు పూజింప గ్రక్కున ॥మేలుకొనరే॥
చరణము 1
దిక్కు లెల్లను దేజరిల్లెను దినకరుండుధరుంపనయ్యెను మ్రొక్కులకుప్రతిఫలము నిచ్చెడు మూలకర్తకు గొలువసేయగ ॥మేలుకొనరే॥
చరణము 2
పక్షు లెల్లను గిలకించును ప్రభునిమహిమలు బల దొడ్డగెను రక్షకునిసకలోపకృతులను రమ్యముగా నుతియించిపాడగ ॥మేలుకొనరే॥
చరణము 3
నిదుర బోయిన వేళ మిమ్మొక్క నిమిషమైననుబాసియుండక పదిలముగా రక్షించు దేవునిప్రస్తుతింప మహా ముదంబున ॥మేలుకొనరే॥
చరణము 4
మేటియైన హృదయాబ్జములలో మీకృతజ్ఞతా భూషణంబులు నాటుగా ధరియించుకొనిఇటు నిర్మలాత్ముని బూజసేయగ ॥మేలుకొనరే॥
చరణము 5
తెల్లవారగ దెలియరే యిది తెలివిగల మానవసమాజము ఉల్లాసిల్లుచు నీతి భాస్కరుడుదయమయ్యెను హృదయముల పై ॥మేలుకొనరే॥