#486

భక్తుని జీవిత ప్రయాణము

రాగం: యదుకులకాంభోజి · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
పయనమై యుంటినయ్యా నీ – పాదాంబుజముల సన్నిధికిప్రభు యేసు నాతో నుండవే నీవు – దీనుడ భవదా – ధీనుడ నన్ను గృప – తో నడిపించుమె – దుట నదె సింహ – ధ్వనముతో మృతి వచ్చుచున్నది – దాని భీత్యోత్పా – తము దొలగింపవే ॥ పయనమై ॥
చరణము 1
శరణిలో నే బోవునప్పుడు – శ్రమ లెన్నెన్నో చనుదెంచి నా – పరుగు కడ్డముగా నిలుచునేమో – మరణపు ముండ్లను – విరుచుటకును –దురవస్థలు వెసన్ – దొలగించుటకును – గరుడానిధి నా – సరస నుండుమి – శరణాగతునకు – మరి దిక్కెవ్వరు ॥ పయనమై ॥
చరణము 2
దేవా నీ దక్షిణ హస్తముతో – దీనులను బట్టెదవ వెరవకండ – నీవాగార్థమున కిది సమయంబు – ఆ వచనము నా – జీవాధారము – దైవముతల్లియున్ దండ్రియు దాతవు – నీవే సర్వము –నిన్ను నమ్మితి నా – త్రోవ ప్రయాణము – తుద ముట్టించుము ॥ పయనమై ॥
చరణము 3
పొందుగా నీ భక్తియందు – డెంద మానందించునప్పుడు – సందియము లేనెన్నెన్నో చనుదెంచి – తొందర పెట్టకుండ నా – త్రోవను తద్వారా – ధాంధతలేకుండా ॥ పయనమై ॥
చరణము 4
కాలం బైయ్యెను రారమ్మనుచు – నీల మేఘాకృతితో వచ్చి – కాలదండముగిరగిర ద్రిప్పుచు – చాల భయానక లీలన్ మృత్యువు – మ్రోల నిలిచిన – వేళను దాలిమి– దూలి చనంగ – బోలు భవత్కరు – ణాలింగన సుఖ – మత్తరి నొసగవే ॥ పయనమై ॥
చరణము 5
నీ దివ్య రూప ధ్యానంబు – నిర్మలాత్మాంతర సౌఖ్యంబు –నా దేవుని ప్రేమామృత సారంబు – నీ దాసుని కవి – నిరత మొసంగుచు– నా దారిని గల – సేదలు దీర్పను – నాదియు మధ్యము – నంతము లేని పు –నాదులుగల నీ – సౌధము జేర్పవే ॥ పయనమై ॥
చరణము 6
ఎండమావుల కీడైనట్టి – యిహసౌఖ్యములు త్వరగా బోవు నీ – నిండు దరుగని నిత్యానందంబు – దండిగ నీయందుండినవారి క – ఖండామృత సౌ – ఖ్యము లిచ్చెదవట – తండ్రి భవదు –త్తమ దాసుల నీ – వుండిన చోటనే – యుంచుము చాలును ॥ పయనమై ॥