#485

భక్తుని వృద్ధాప్యము

రాగం: సావేరి · తాళం: అట · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
సకలేంద్రియము లారా – చాల మీ పని తీరె – నిక నన్ను విడిచి పోవుటకు వేళయైనది ॥చకిత మృగ శాబకము పోలిక – నకట మీచే జిక్కితిని ॥శ్రవణేంద్రియము నీదు – శక్తి తగ్గుచు వచ్చె – వివిధ వార్తలు దగిలి – వినుచుంటివెంతొ – చెవుడు నీ కిప్పుడనుసరించెను – చేవ తరిగెను జరిగి పొమ్మింక –సవినయంబుగా యేసు క్రీస్తుని – శబ్ద మాలించెదను సుఖ మది ॥ సకలేంద్రియము ॥
చరణము 1
కనులారా మీ వెలుగు – క్రమముగా క్షీణించె – మునుపు చూచు చూడ్కిలో – ముసుకయ్యె నికను – ఘనముగల దేవుని కుమారుడు – తన కృపాసనమిప్పుడు చూపును – మనసు లోపలి కన్ను విప్పెడి –దినము లీ వెంచెద జూడుడి ॥ సకలేంద్రియము ॥
చరణము 2
రసనేంద్రియము నీ – రస కాలమిదె వచ్చె – విసుకని మాటలను వెదజల్లినావు – పసిడి దిరిగిముదివైతివిపుడు – రసన నీ యింక తీరె నీ పని –వ్యసనమున నే నిప్పుడేసు కరుణా – రసము గ్రోలుచు బ్రొద్దు బుచ్చెద ॥ సకలేంద్రియము ॥
చరణము 3
తనదు వాద్యంతము మూయ – దగిన త్వగింద్రియమా – నిన్ను తాకునట్టి వ –న్నియు గ్రహించితివి – మునుపుగల నీ బిగువును నణంగెను – వ్రేలాడె దిక్కులు – చనుము నీ వెందైన నేనే – సుని స్వరూపము దాల్పబోయెద ॥ సకలేంద్రియము ॥
చరణము 4
ఘ్రాణేంద్రియమ నీవు – కడు వాసనల దగిలి – ప్రాణానిలము చేత – బ్రతికితి వికను – నాత్యమైనవి విడువును దూర మార్గముల డేలబోదు విక నా – ప్రాణపతియగు క్రీస్తుచేతను – బ్రాణమర్పింతును సుఖింతును ॥ సకలేంద్రియము ॥
చరణము 5
కడు దవ్వు పయనము – నడచి వచ్చితి నింక – నిడుపు లేదుగా త్రోవ – నికటమైవచ్చెన్ – నడుమ నడుమ నడుడ్డుపడియెడ – నిడుమ లన్నియు గడచి పోయెను –జడుతు నా మృతి నదికి నా నా – వికుడొచ్చెను నన్ను గావను ॥ సకలేంద్రియము ॥
చరణము 6
వెనుక దిరిగిన మార్గ – మున కంటె ముందుండి – కన్పించు నా త్రోవ –కఠినమై యుండు – ఘన తరంగ ధ్వనితో భీ – కర మరణ నది పారుచున్నది – క్షణము మాత్రమే దాని పని యా – వెనుక నావలి యొడ్డుజేరెద ॥ సకలేంద్రియము ॥
చరణము 7
ఈ సంసారమునందు – నేమి సౌఖ్యము గలదు – ఆశ మాత్రమే గాని –యది చిరము గాదు – యేసు క్రీస్తుండు తండ్రి దేవుండు –భాసురంబగు నిర్మలాత్మయు – దాసులకు దమ దివ్యమగు కృప – చేసి నిత్యనివాసమిత్తురు ॥ సకలేంద్రియము ॥