#484
లోక విసర్జనము
పల్లవి · Pallavi
పోపోవే యో లోకమా – చాలింక జాలు – నీ పొందు మే మెందులవము – పాపేచ్ఛలున్నంత – సేపు నొప్పగ రా ని – వేపాట్లు బెట్టితివి – వీపట్ల నన్ను వీడి ॥ పోపోవే ॥
చరణము 1
సకలేంద్రియ వ్యాప్తులు – నీ సేవ బా – యక చేయు దివసంబులు – ఇంక నిరపోయె భ్రా – మికము చూపకు మిప్పుడు – ప్రకటముగా క్రీస్తు – పద భక్తి మాకబ్బెన్ ॥ పోపోవే ॥
చరణము 2
నీ రాజు బహుమానము – గంటిమి ఘోర – నరకాంబుధి తీరము – దారి దొలగి నిన్ను– జేరి దుఃఖముల వే – సారి తిప్పడు క్రీస్తు – సదయుడై నన్ను బిలిచెన్ ॥ పోపోవే ॥
చరణము 3
ఎర జూపి బలు మీనము – బట్టెడు వాని – కరణి వస్తుల రూపము – బొరి జూపిలోభము – బుట్టించి నన్ను బట్టి – పరిమార్చితివి యింక – మరి యేమున్నది చాలున్ ॥ పోపోవే ॥
చరణము 4
ఎండమావుల తేటలు – నీ విచ్చెడు – దండిన ఐహ సుఖములు – కండగర్వముచే నీ – యండ జేరితిగాని – నిండు నెమ్మది దయా – నిధి క్రీస్తు నిప్పుడిచ్చున్ ॥ పోపోవే ॥