#483

జీవిత యాత్ర

రాగం: ముఖారి · తాళం: ఆది · రచయిత: గొల్లపల్లి నతానియేలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
పరదేశుల మో ప్రియులారామన పుర మిదిగా దెప్పుడు – నిజముగా ॥ పరదేశుల ॥
చరణము 1
చిత్ర వస్తువులు – చెల్లెడి యెకవి – చిత్రమైనసరిత – లోకము ॥ పరదేశుల ॥
చరణము 2
సంత గొల్లు క్షమ – సడలిన చందము – బంతయుసద్దణగున్ – నిజముగా ॥ పరదేశుల ॥
చరణము 3
స్థిర మని నమ్మకు – ధర యెవతೀರಿకిని –పరలోకమె స్థిరము – నిజముగా ॥ పరదేశుల ॥
చరణము 4
మేడలు మిద్దెలు – మేలగు సరుకులు – పాడై కనబడవే – నిజముగా ॥ పరదేశుల ॥
చరణము 5
ధర ధాన్యంబులు – ధర తగ్గక మానవు – పనిపాటలు పోయె – నిజముగా ॥ పరదేశుల ॥
చరణము 6
ఎన్ని నాళ్లు మన – మిలలో బ్రతికిన – మనలైపోవునుగా – దేహము ॥ పరదేశుల ॥
చరణము 7
వచ్చితి మిచ్చటికి – వట్టి హస్తములతో – తెచ్చిన దేదియు లే – దుగదా ॥ పరదేశుల ॥
చరణము 8
ఎట్లు వచ్చితిమి – ఈ లోకమునకు – అట్లు వెళ్లవలయున్ – మింటికి ॥ పరదేశుల ॥
చరణము 9
యేసునందు వి – శ్వాసంబుంచిన – వాసిగనిను జేర్చున్ – పరమున ॥ పరదేశుల ॥
చరణము 10
యేసే మార్గము – యేసే సత్యము – యేసే జీవముగా – నిజముగా ॥ పరదేశుల ॥