#482

క్రైస్తవ యాత్ర

రాగం: బిలహరి · తాళం: అట · రచయిత: విలియం డాసన్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
పదరే సోదరులారా – పరమపురి జేర –మధుర జీవాధార – పదవి చేకూర – తుది మొదలును ఆపద – రేబగలు లేని – సదనంబునకు జేర – సదయుడేసుని గూడి ॥ పదరే ॥
చరణము 1
ఎన్ని దినములు బ్రతికిన – నేమి సౌఖ్యంబు – అన్నివిధముల జూడ – నధిక కష్టంబు – కన్ను మూసిన నాడు – మన్ను పాలౌదుము –మున్లు జాగ్రత్త నొంద – కున్న నష్టము కలుగు ॥ పదరే ॥
చరణము 2
ధరణి బ్రతుకును గోర – మరణ భయంబు –దరిలేని చింతల – దగిలె నిత్యంబు – పరి పరి విధముల – పరుగు లెత్తుట యేల –నిరతంబును సువార్త – సరణి గన్గొని వడిగా ॥ పదరే ॥
చరణము 3
ధనము సంపాదించి – ఘన మది కమున్న – తనువె సతము గాదు – అనుభవము సున్న – ఇను డెంద మావముల – ను గోరనేపాటి – తనివి తీరునిచ్చోట – ను నా పాటే తీరున్ ॥ పదరే ॥
చరణము 4
పరలోక మార్గము – బిరుకై గనప్పడును జొరగాసంకటములు – నెరజుట్టుకొనును – పరమ జనకుని కృపా – వరము తోడుగనున్న – వెరపు నొందక వింక – సరకు సేయుము పద ॥ పదరే ॥
చరణము 5
ఇహ క్షేమములు మన – కింక జాలు జాలు – బహుదినంబులు సేయ – బడ నేమి మేలు – మహిమ దూతల స్నేహ – మమరు నచ్చట –మనకు నహహా యేసుని జూడ – నధిక సంతోషంబు ॥ పదరే ॥
చరణము 6
మనల తోడ్కొని పోవ – ఘనుడు యెహోవా –యనంబు తన శుద్ధా – త్మను నిచ్చి కావ – నేన లేని యడ్డంకు – లన దాటింపను గృప – గనుపరిచితోడుగ – నునికిచే వేగము గూడి ॥ పదరే ॥
చరణము 7
భక్తులై యున్నట్టి – బంధు మిత్రుల – రక్తిగుణముతో – రంజిల్ల గనినన్ – ముక్తి రాజ్యంబుల – మురువుతోడ సర్వ – శక్తుని మహిమ నా – శక్తితోడను చూతుము ॥ పదరే ॥