#479
క్రైస్తవ యాత్రికుడు
పల్లవి · Pallavi
ఇందు లేదు నిలుచు పట్టణము – క్రీస్తు యాత్రికులకు – నిందు లేదు నిలుచు పట్టణము ॥ ఇందు ॥
చరణము 1
పాడుకొన్న లౌకికమునకు – బహుళ దుఃఖమిది మరి సొం – పైదగు మేలుచోటు వెదకు – భక్తుడు వెత నొంద నెప్పుడు ॥ ఇందు ॥
చరణము 2
మాకు నిల్వదైన దుఃఖ – మౌకదా వచ్చు పురము – దాకొనంగ వెదకెదము –ధైర్యమిచ్చు నిదియే మాకు ॥ ఇందు ॥
చరణము 3
మనము యాత్రవారి వలెనే – ఘనత విశ్రమంబులేక – కనుక నీ లోకమునను– కృంగి వన్ని వదలుదాము ॥ ఇందు ॥
చరణము 4
మిగుల యాత్రపరుల విశ్ర – మించు సౌఖ్య వాసమా – ఖగము వలెనే టెక్కలున్న –నెగిరి నిన్ను జేరుకొందు ॥ ఇందు ॥
చరణము 5
సద్దు నా యాత్మ నణంగ – వద్దు తగిన వేళగావి – యొద్ది కతని తలంపుజేతు నొసగు విశ్రమంబ తండ్రి ॥ ఇందు ॥