#478

విజ్ఞానికి విసుగు

రాగం: శుద్ధకాంభోజి · తాళం: జంపె · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
విసుకదె ప్రాణంబు – విజ్ఞానికిలను – పొసగు వైరాగ్యంబు – పుట్టదే –తలను – అసదుగానట్టిక – క్షానుభవమేగాని – యసదృశానందఫల – మొసగునది యేది ॥ విసుకదె ॥
చరణము 1
మును పేది యుండెనో – వెనుక నదియునుయుండు – మునుపు వెనుకకు మధ్య – మున నున్న దదియే – నొనరంగగ్రోత్తయై – యుత్పన్నమగునట్టి – ఘనకార్య మొక్కటియును –గానంగరాదు ॥ విసుకదె ॥
చరణము 2
ధరణి మీదికి దిగం – బరుడగుచు నేతెంచు – మరణమప్పుడు దిగం – బరుడగుచును బోవున్ – నరుడు పుట్టిననాడు –సరెకేదియును దేడు – మరణమగునాడు ఒక – సరకు గొనిపోడు ॥ విసుకదె ॥
చరణము 3
ఒక తరము పోవు మరియొక తరము జనుదెంచెన్ – సకల వంశము లీట్లు – సమసిపోవుచుండ – నిక వారి పేరెరుపు –లేచోట నేమాయె – నొక్కండైనా జెప్పుటకు నిలలో లేడు ॥ విసుకదె ॥
చరణము 4
ఏటి వంకలు తీర్చ – నెవానికి గల విము – న్నిటి మూకుడు చేయ – నేర్పరి యెవండు – మోటైన మనసు వం –పులు తీర్చు గురు వెవ్వడు కోటి ధన మిచ్చినను – కుంభినిని లేడు ॥ విసుకదె ॥
చరణము 5
ధరణిలో నరరూప – దాల్చి పాపుల కొరకై – మరణమై లేచు స – ద్గురుడైన యేసు – చరణాబ్జముల సేవ – సారమిదియొక్కటే – పరమ ఫలమిడుసుఖ – ప్రాప్తి యొనరించున్ ॥ విసుకదె ॥