#477
ఇహ లోకము విశ్రాంతి లేనిది
పల్లవి · Pallavi
ఏది నా విశ్రాంతి – ఈ లోకమందు – నే దిక్కు గనుగొన్న – లేదు సుఖమొందు – మేదుర మోదని – త్యోద్యదగ్ర మోక్ష పుట – భేదమున కొరకున్న – లేదుసుఖ మెచ్చట ॥ ఏది ॥
చరణము 1
కష్టములు తెరతెరలు – గా వచ్చిన మదాత్మ – దృష్టి దప్పక యోర్చి – తీరమందుండ వలయున్ –స్పష్టమగు నా త్రోవ – పయనంబు తుద ముట్ట – శ్రేష్ఠమగు నా యిల్లుజేరు నందాక ॥ ఏది ॥
చరణము 2
కోరింద పొదచుట్టు – కొనియుండ నిమ్ము నే – గోర నిచ్చట గులాబి – కుసుమ శయనంబు – నే రీతినైనా నా – యేసు రొమ్మున జేరి – భూరి సుఖమొందెద వి – చార మింక నేల ॥ ఏది ॥
చరణము 3
యేసుప్రియ మించు కే – నెరిగి కన్గొను వేళ – నా సంతోసము నిండు – పాసిచనె నెల్ల చీకటులు – భాసురంబుగా మంచు – పగిలి దళ తళలాడ –జేసె నా కన్నీళ్లు – చింతలెడబాపి ॥ ఏది ॥
చరణము 4
ఉండు నే సందియము – లుండు నే దుఃఖములు – గండములు డయ్యునుచుబైకి రా గలవే – మెండుగా మధురమై – యుండు మోక్షమునాకు – తండ్రితో గడియసే – పుండనిచ్చిన జాలు ॥ ఏది ॥
చరణము 5
నడుము పై నొక సంచి – బడెకరు కరము చేతిలో – నిడికొనుచు శత్రువుల – పుడమివే గడుతుకన్ – నడుదారి కరుకు నె – నన్నక వేగ రక్షింప – భద్రుడననిపాడి చని – పరమ సుఖి నౌదు ॥ ఏది ॥