#476
యేసు భాగ్యదాత
పల్లవి · Pallavi
యేసుని సేవింప దయచేసితివి –ప్రేమస్వరూప – యేసుని – దాసులనందరిని దరి జేర్చుటకును – వాసికెక్కినపరవాసము చేసెడి ॥ యేసుని ॥
చరణము 1
ఆదియందు భూమ్యాకాశంబుల – శక్తి యాత్మ నింపార సృజించిన ॥ యేసుని ॥
చరణము 2
శత్రువులగు జనసంఖ్యను బొడగని – మిత్రుడుగుచు ధనమేను నొసంగిన ॥ యేసుని ॥
చరణము 3
పాపులెల్ల ధనప్రాపుగోరుకొని – దాపుగరండని దయచేసి బిలిచెడి ॥ యేసుని ॥
చరణము 4
సకల శుభంబులు చక్కగా నిచ్చుచు సకల భక్తులను సమముగా నేలెడి ॥ యేసుని ॥
చరణము 5
తనను నమ్ముకొని యున్న దీనులకు – దననుగా ప్రబలుడై యుండని సన్నుతుడగు మా ॥ యేసుని ॥
చరణము 6
చక్కని గుణములు లెక్కలేక తన – చక్కని యాత్మను చిక్కగా బట్టిన ॥ యేసుని ॥
చరణము 7
లోకమంతయును లోబడుచుండగా – నేక ప్రభువై యేలుచుండుమా ॥ యేసుని ॥