#480

లోకము క్రీస్తుకు సాటిరాదు

రాగం: మారువ · తాళం: ఆది · రచయిత: పురుషోత్తము చౌదరి

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
లోకము వారెల్లా – లోకువన యెంచిన – లోపము నీకేమిటి – ప్రాకటముగా గ్రీస్తు – పతిత పావన మూర్తి – నీకోసమై ముక్తి – నిలయము గట్టంగ ॥ లోకము ॥
చరణము 1
దరిలేని దురిత దుస్తర పారావారము – దాటించు వారెవరు –భీకరమైన – నరకాగ్ని బెట్టు బంధుర దైవకోపాగ్ని – మరలించు వారెవరు – చంచల బుద్ధి స్థిరపరచి పరమార్థ– మెరిగించి చిరముక్తి – గురి దెల్పు వారెవరు – ఈ ధరణిలోన నరరూపము దాల్చి నీ – కొరకై జీవనమిచ్చు – కరుణాబ్ధి క్రీస్తుండు –వరదుడై యుండంగ ॥ లోకము ॥
చరణము 2
మాటి మాటికి పాప – మార్గమున జనుచుండ – మది త్రిప్పు వారెవరు– సైతానుని తాటించి మరి వాని కైటించి యభయహస్తము నిచ్చువారెవరు – మృత్యువు ముల్లు మీటించి సుఖమాత్మ– నాటించి తన యోర్మి – చాటించు వారెవరు – యెరూషలేము బయట గల్వరి మెట్ల – పై మేనుబలియిడిన – మేటి క్రీస్తుని నామ – మమృతము నీకుండగ ॥ లోకము ॥
చరణము 3
హృదయ సంతాప దుఃఖ దురంతమగు చింత – లతికించు వారెవరు –నెమ్మది నిచ్చి – పదిలమ్ముతో మోక్ష – పదవి యిడుగో యెంచు – పదవునువారెవరు – ఎన్నడు నిన్ను వదలి వేయమంచు – మృదు వాక్యములు తెలిపి – ముదమిచ్చు వారెవరు ఇంకొక్కనాడు సదయుడై క్రీస్తుడు – చనుదెంచి నిను ముక్తి – సదనమున స్థిరముగా జేయు శాస్త్రోక్త మిటలుండ ॥ లోకము ॥