#467

ఉదయమున విత్తనము నాటుము

రాగం: ఇంగ్లీష్ మూలం: Sowing in the morning · రచయిత: కె. షా (అనువాదం: ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్)

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
రేపు మాపు గూడ రమ్యమైన విత్తనములప్రీతితోను జల్లి వేసి యుందముకాపుతోడ నుండి దాపు నుండు పంటఏపుమీర పంటను కోసి కొందము ॥
చరణము 1
పంట పండగా కోసి కొందముకంట నీరు పోవ కోసి కొందము ॥
చరణము 2
సందేహంబు లేక స్వామి సేవ యందువందనంబు తోడ విత్తుచుందముకొండలంబు లేక కష్ట వృత్తి చేసి యందరంబు చేరి యానందింతము ॥
చరణము 3
ప్రేమ విత్తనంబులు క్షేమమయంకురంబులుప్రీతిని కాలమెల్ల ప్రాంతమంతటన్సేవము మొప్ప నాట నాట నీయకుండు రాగనే నిండు పంటను కోసము గూర్చుకొందము ॥