#466

కరుణాయుత కార్యములు

రాగం: మోహన · తాళం: ఆది · రచయిత: జొన్నకూటి దానియేలు

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
కరుణాయుతంబౌ కార్యములు – కనబడవలె గాదా మనలో – అనవరతము మన బ్రతుకు ప్రభునికై – అంకితమగునట్లు – అలవరచుకొనగా ॥ కరుణాయుత ॥
చరణము 1
పొరుగవాని ప్రేమింతము మనము – కొరతలన్ని యిక తీరును మనకు – తరగక పడెడి గుణమది మనలో – త్వరితగతిని సవరించుకొందమిక ॥ కరుణాయుత ॥
చరణము 2
కుంటి గ్రుడ్డి కుష్ఠు రోగులెందరో – కంఠమెత్తి ఘోషించుచు నుండ – ఇంట గుడించి సుఖియించుట న్యాయమా – వంటబట్టదది స్వార్థపరత్వము ॥ కరుణాయుత ॥
చరణము 3
పండువంటి కాపురంబు మనది – దండి ప్రభుడు దయచేసెను మనకిది – బండు లోడలౌ ఓడలు బండ్లును – ముండ్ల కిరీటము ముందు బెట్టుకొని ॥ కరుణాయుత ॥
చరణము 4
మనుజులందు గలవు రెండు తెగలు – వినుము పుచ్చుకొనెడివారి దొక తెగ – మనసు దీర నిచ్చువారి దొక తెగ – గనుమ మనస నీ వెందు గలవో యిక ॥ కరుణాయుత ॥
చరణము 5
కరుణ రసము మాకు ప్రభువా – కలుగును కృప నివమ్మా యెప్పుడు – అరమర లేకను అన్ని సమయముల – నందరి ప్రేమను జూడ నడుపుము ॥ కరుణాయుత ॥