#463

సువార్త సేవా భారము

రాగం: ఆనందభైరవి · తాళం: త్రిపుట · రచయిత: కేసనపల్లి అబ్రాహాము

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
భారమైనది సేవ – మరణము కన్న – భారమైనది సేవ – ఘోర నరకపుదారి – చేరి నడిచెడి వారిన జేరి వారితో – సంప్రదించి ప్రభువును చూపి – ఘోర నరకపు బాధలన్నియు – కూర్మితో వినజెప్పి –మోక్షపు – దారికిని – నడిపించి – యేసుని – దాపునకు నడిపించు దారి ॥ భారమైనది ॥
చరణము 1
దురిత దుర్గతి నశియించు వారిని జూసి – పరితాప – మొందవలయున్ –మారుమనస్సు నొంది – చేరి ప్రభునితో గలిసి – ఘోర పాపిని నేనని – వేడి –సిలువ ధ్యానించి – దురితములను – చేయనని తీర్మానములను చేసికొని –రక్షింపబడినది గురుతుగా సాక్ష్యంబు నిచ్చుటయే దారి ॥ భారమైనది ॥
చరణము 2
ప్రథమ దశ భాగంబుల – ప్రభునకు నిచ్చి – ప్రతిదినము ప్రార్థింపవలెన్ – అధములగు –బీదలకు నాధారముల నొసగి – విధిగ భక్తుల – నాదరించి – సవరించి –ప్రభువు వాక్యము – చదువుకొనుచు – ప్రభుని పాటలు పాడుకొనుచు – ప్రభునివేదము ప్రచురపరచి – పదిలముగా – జీవింపగోరి ॥ భారమైనది ॥
చరణము 3
దేశదేశముల దిరిగి – దేవుని వాక్యము – దేశప్రజలకు చాటవలెన్ –ఆశాదురాశలను – కోసివేసి యేసు – దాసులను జేసి – వెలిగించి తిలకించి –యేసుభక్తుల పదిలపరచి యేసుతో – పరిచయము చేసి – యేసును ధరియింపజేసి – యేసుతో నివసించు దారి ॥ భారమైనది ॥