#464
దేవుని పనియు, మనుష్యుని పనియు
పల్లవి · Pallavi
యెహోవాయే నా – మహా దేవుడని – బహుగా నే నరిగి మన నావంతు –సహదాసులతో – మహి నొక్కడనని – సహాయముడుటె నీ వంతు ॥ యెహోవా ॥
చరణము 1
మితిమీరిన దు – రిత సమూహముల – ఖేదము నరప మన నావంతు – పతిత పావనుని – ఖేద జనములలోనన్ను – నుతికి కడుగుటె నీ వంతు ॥ యెహోవా ॥
చరణము 2
ప్రతిదిన బ్రతుకును – మతి నుంచుచు నిన్ను – స్తుతి యొనర్చుటె నా వంతు – ఖేదినే బడుదును – రెక్కలనుండ శాశ్వతముగ బ్రోచుటె నీ వంతు ॥ యెహోవా ॥
చరణము 3
చంచల మతి దొల – గించుమంచును బ్రా – ర్థించుచుండుటె నా వంతు – అంచితాత్మ నికను – బంజి స్థిరతను – బెంచుచుండుటె నీ వంతు ॥ యెహోవా ॥
చరణము 4
యేసు సిలువలో – నే సంధించి – గాసి సహించుట నా వంతు – భాసుర మోక్ష ని – వాసమునకు నన్ను – దీసుకొని పోవుటె నీ వంతు ॥ యెహోవా ॥
చరణము 5
మేటి వార్త నా – బోటి జనాళికిని – చాటించుటయే నా వంతు – చాటిన దానిని – గాటముగా మది – నాటించుటయే నీ వంతు ॥ యెహోవా ॥
చరణము 6
అనుదినమబలుడ – నని మది నెరిగి – గొని బ్రతుకుటయే నా వంతు – నన్ను బ్రదాపంజ – జనుల జేర్చియు బల – మును గృప నిచ్చుటె నీ వంతు ॥ యెహోవా ॥
చరణము 7
ముదముతోడ నీ – తుది రాక కొరకు – నెదురు చూచుటె నా వంతు – సద్విమలాత్మచే – హృదయమును సదా – పదిలపరచునటె నీ వంతు ॥ యెహోవా ॥