#462

యేసును వెంబడించుము

రాగం: శంకరాభరణము · తాళం: ఆది · రచయిత: ఎ. చార్లెస్ కిన్సింగర్

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
జయ ప్రభు యేసుని వెంబడించుచు – జయముగా నడచెదము – యేసుతోజయముగా వెడలెదము – ప్రియుడగు యేసునిప్రేమను చవిగొని – పయనము చేసెదము మా ప్రభు వెంబడి ॥ జయప్రభు ॥
చరణము 1
ఆదరణయు నధిక బలమును ఆత్మఖడ్గమును – అవనిలో నందరి రక్షయును – ఆదర్శంబౌఆయన వాక్యమే – అనిశము మనకిల మార్గము చూపగా ॥ జయప్రభు ॥
చరణము 2
ధర విరోధులు మమ్ము జుట్టగా – దరి జేరెద మేసున్ – ప్రభుని దరిజేరెదమేము – ధాత్రి దురాశలండంబులన్నిటి – మైత్రిని వీడి నడచెద మేసుతో ॥ జయప్రభు ॥
చరణము 3
మా ప్రభు ఈవుము నీదు మార్గపు – మాదిరి జాడలను – నీ దగు –మాదిరి జాడలను – మా పాదములను దొట్రిల్లకుండగా – మా కడు బలమును మీ కృపా దివమున ॥ జయప్రభు ॥
చరణము 4
మా కొరకై నీవు నడిచిన – మార్గము చూడగను – మేము మార్గము చూడగను– మా రక్షక నీ అడుగుజాడలు – మరువక విడువక నడువగ కృపనిడు ॥ జయప్రభు ॥
చరణము 5
ఇహ పరముల నినుగాక ప్రేమతో – నెవరిని గొలిచెదము? – ఎవరిని ప్రేమింపవశము? – విహరించెదము యేసుని వెంబడి –మహిమ రాజ్యమున యేసుని గొలువగా ॥ జయప్రభు ॥