#461
ఆత్మల సంపాదనము
పల్లవి · Pallavi
ఆత్మలను సంపాదింప నగు – ఆత్మ బలముననిది చేయనగు – ఆత్మ సంపాదనముకన్న – నక్షయానందము లేదనల – యాత్మలనువెదకి రక్షింప నాత్మల కాపరి యా నతిచ్చె ॥ నాత్మలను ॥
చరణము 1
ధనముకన్న నాత్మ సంపా – ధనము మేలౌ దాని సంపా – ధనము గోరి మనరక్షకుడు – ధారపోసెను ధన రక్తంబు ॥ ఆత్మలను ॥
చరణము 2
క్షణ క్షణము నెందరో నశింప – జాలిలేద నీవు సుఖింప – అణకువతోననుదిన మొక యాత్మ – నైన రక్షింపగ దయ రాదా ॥ యాత్మలను ॥
చరణము 3
పరుల యాత్మ విమోచనంబు – ప్రభువు కోరు బహుమానంబు – పరదుడౌక్రీస్తును నీవెట్లు – వట్టి చేతులతో దర్శింతు ॥ ఆత్మలను ॥
చరణము 4
నీతి మార్గము ననుసరింప – నిత్యమును చక్కగా వర్తింప – పాతకులనుద్రిప్పెడు సద్భక్తుల్ – జ్యోతులట్లు ప్రకాశించెద రింక ॥ ఆత్మలను ॥
చరణము 5
జీవనాథంబులు లేవని – సిగ్గు పడకుమి యిది కాదని – ప్రీతితో నాత్మలను గడుప – నీతి మహిమ మకుటంబులౌ ॥ ఆత్మలను ॥
చరణము 6
నీ యమూల్య తరుణంబుల – నీ ప్రశస్త దానంబుల – వేరుచేయక నీ సర్వంబు – విభుని సేవకు నీ వర్పించు ॥ ఆత్మలను ॥