#460
సువార్త ప్రకటన
పల్లవి · Pallavi
చాటుడి శుభవార్తను – బోధకులారా – చాటుడి శుభవార్తను – చాటుడి శుభవార్త – సకలరాష్ట్రములలో – చాటించుడని చెప్పె – దాటిగా ప్రభు యేసు ॥ చాటుడి ॥
చరణము 1
లోకమును ప్రేమించి – లోక రక్షణ కొరకు – ప్రాకటంబుగా సుతుని – బంపె దేవుడటంచు ॥ చాటుడి ॥
చరణము 2
శత్రువుల రక్షింప – మిత్రుడుగా వచ్చి –మైత్రి నసువు నిచ్చి – మరల లేచెనటంచు ॥ చాటుడి ॥
చరణము 3
ఎట్టి పాపులైన – బట్టి యేసుని మాట – దిట్టముగా నమ్మిన – బట్టుగా క్షమియించును ॥ చాటుడి ॥
చరణము 4
హృదయ శుద్ధిని గోరి – సదయుడగు రక్షకుని –పదిలముగా ప్రార్థింప – పరిశుద్ధాత్మ నొసంగును ॥ చాటుడి ॥
చరణము 5
నమ్మి బాప్తిస్మము – నెమ్మది బొందిన మనుజు –లిమ్ముగా బొందుదురు – ఇలను ఘన రక్షణము ॥ చాటుడి ॥
చరణము 6
ఇందు నందు మీకు – బొందుగా నొసంగును – సంధియము లేకుండ సకల భాగ్యములనుచు ॥ చాటుడి ॥