#459

ఎవరు ప్రభుని పక్షమున నున్నారు?

రాగం: యదుకులకాంభోజి · తాళం: ఆది · రచయిత: టి. గురవయ్య

Category: విశ్వాసము — ప్రార్థన — క్రైస్తవ అనుభవం · Open in the hymnal app

పల్లవి · Pallavi
ఎవరు క్రీస్తు వైపు నున్నారు – ఎవ రేసుని వారు – రాజౌదివ్య యేసు ప్రభుని కొరకై – యెవరు సేవ చేయుచు నుందు ॥ నెవరు ॥
చరణము 1
నాశనం బగు నాత్మల కెల్ల – నాశ్రయరక్షకుడౌ – క్రీస్తు – యేసును దెల్ప లోకమును – విసర్జించి సేవ చేయ ॥ నెవరు ॥
చరణము 2
లయము గాని యేసు శక్తియే – జయము పొందును – ఆయన – ప్రియమౌ సేనయందు జేరి – సాతాను నెదిరించి గెలువ ॥ నెవరు ॥
చరణము 3
మరణము నందు గూడ మాకు – గరుణ జూపిన యేసు నీ కొ – మరులమై మేమందరము నీ – దరికి జేరి యున్నాము ॥ ఎవరు ॥